హైదరాబాద్ : ఈ దేశంలో ఫెడరల్ వ్యవస్థ దెబ్బతింటోందని, దాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు గుత్తా సుఖేందర్ రెడ్డి.
ఈ సందర్భంగా మండలి చైర్మన్ మాట్లాడుతూ.. ఈ దేశానికి అంబేద్కర్ ఒక స్ఫూర్తిని అందించారని తెలిపారు. పేద ప్రజల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రైతుబంధు, దళిత బంధు లాంటి పథకాలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. కేంద్రం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.