నల్లగొండ : తెలంగాణ మీద కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తూ, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి చిట్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని అభివృద్ధి కార్యక్రమాలను మన ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక, అక్కసుతో కొన్ని పార్టీలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. తెలంగాణ వ్యతిరేకులు ఎవరో,అభివృద్ధి ప్రదాతలు ఎవరో తెలంగాణ ప్రజలు గుర్తించాలన్నారు. తెలంగాణ రాష్టానికి వ్యతిరేకంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు.