హైదరాబాద్, జనవరి27 (నమస్తే తెలంగాణ): వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్‌కు టీఎస్‌డబ్ల్యూఆర్‌టీఈఏ ( తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ టీచర్స్, ఎంప్లాయీస్ అసోసియేషన్) సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు, ప్రధాన కార్యదర్శి ఎన్ దయాకర్ సోమవారం ప్రకటన విడుదల చేశారు.