Telangana | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నాల పర్వం కొనసాగుతూనే ఉంది. మొన్న స్టాఫ్ నర్సులు, ఏఈఈ అభ్యర్థులు ఆందోళన చేయగా, తాజాగా గురుకుల టీచర్లు ఆందోళనకు దిగారు. తమకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు.. కానీ పోస్టింగ్ ఇవ్వలేదంటూ గురుకుల టీచర్లు ధర్నాకు దిగారు. లోక్సభ ఎన్నికల ముందు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఎత్తేశారు. అయినప్పటికీ పోస్టింగ్లు ఇవ్వడం లేదని బాధితులు వాపోయారు. గురుకుల అధికారులను సంప్రదిస్తే.. ప్రభుత్వం అనుమతులు ఇస్తేనే పోస్టింగ్స్ ఇస్తామని చెబుతున్నారని అభ్యర్థులు పేర్కొన్నారు.
మాకు జాబ్ వచ్చిందనే పేరే కానీ పోస్టింగులు ఇవ్వక రోడ్ల మీద తిరుగుతున్నాం అంటూ రేవంత్ రెడ్డి వద్ద ఆందోళన చేస్తున్న గురుకుల టీచర్లు pic.twitter.com/HgwXtxXx1k
— Telugu Scribe (@TeluguScribe) June 14, 2024