హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎప్సెట్ ప్రవేశ పరీక్షలో గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. బీసీ గురుకులం నుంచి ఇంజినీరింగ్ విభాగంలో 66మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 35మంది విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించారు. ఎస్సీ గురుకులం నుంచి ఇంజినీరింగ్ విభాగంలో 953మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 857మంది విద్యార్థులు అర్హత సాధించారు.
ఈ సందర్భంగా ప్రతిభకనబర్చిన విద్యార్థులను బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయా గురుకుల సొసైటీల కార్యదర్శులు సైదులు, అలుగు వర్షిణి ప్రత్యేకంగా అభినందించారు.