హైదరాబాద్, మే24 (నమస్తే తెలంగాణ): ఎవరెస్టు శిఖరం బేస్ క్యాంపులో నిర్వహించనున్న అడ్వెంచర్ క్యాంపునకు బీసీ గురుకులాలకు చెందిన 20మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఆదివారం జూన్10 వరకు అక్కడ నిర్వహించనున్న ట్రెకింగ్‌లో పాల్గొననున్నారు. బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ కోసం భువనగిరిలో ని రాక్ ైక్లెంబింగ్ సూల్లో చిన్న వయసులోనే ఎవరెస్ట్ అధిరోహించిన మాలవత్ పూర్ణ, రాకేశ్ నేతృత్వం లో రెండు రోజులపాటు 200 మంది గురుకుల విద్యార్థులకు శిక్షణ ఇప్పించారు.
అందులో ప్రతిభ కనబరిచిన 20 మందిని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్‌కు ఎంపిక చేశారు. ఎంపికైన విద్యార్థులను బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సొసైటీ కార్యదర్శి సైదులు శనివారం మెడల్స్‌తో సతరించారు. శిక్షణలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.