హయత్‌నగర్, జనవరి 26: గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలో ఉరేసుకుని ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హయత్‌నగర్‌లో ఆదివారం జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా కొండనాగుల మండలం అంబగిరికి చెందిన ఉడతనూరి సౌమ్య(17) స్థానిక రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నది. ఆదివారం తరగతి గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే వనస్థలిపురం ఏరియా దవాఖానకు తరలించగా.. మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.