చందంపేట(దేవరకొండ), నవంబర్1: దేవరకొండ ఎస్టీ గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. నల్లగొండ జిల్లా హాలియా మండలం తిరుమలగిరి పరిధిలోని జీవీ చెట్టుతండాకు చెందిన మాధవి దేవరకొండ ఎస్టీ గురుకులంలో 10వ తరగతి చదువుతున్నది. సదరు విద్యార్థినిని వారం క్రితం గణిత ఉపాధ్యాయురాలు క్రమశిక్షణతో ఉండాలని, బాగా చదవాలంటూ తోటి విద్యార్థినుల ముందు మందలించడంతో మనస్తాపం చెంది స్వగ్రామానికి వెళ్లిపోయింది. బాలిక తల్లి శుక్రవారం హాస్టల్కు తీసుకొచ్చి వదిలి వెళ్లిపోయింది. అదేరోజు మాధవి ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే వారు దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నది.
మాజీ ఎమ్మెల్యే రమావత్ పరామర్శ
దేవరకొండలో చికిత్స పొందుతున్న మాధవిని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పరామర్శించి వివరా లు అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, కేసీఆర్ ఎలాంటి సమస్యలు లేవని గుర్తుచేశారు.