బంజారాహిల్స్, అక్టోబర్ 10: ఆరున్నర దశాబ్దాలుగా సాహితీరంగంలో విశేషసేవలు అందిస్తున్న ప్రతిభాశాలి ఆచార్య కొలకలూరి ఇనాక్ అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో కొలకలూరి ఇనాక్‌కు గురజాడ పురస్కారాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావుతో కలిసి సోమవారం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాసంలోఅందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్, సాహిత్య అకాడమీ చైర్మన్‌గా పనిచేసిన కొలకలూరి.. అనేక సాహిత్య ప్రక్రియలలో ప్రవీణుడిగా పేరొందారన్నారు. కార్యక్రమంలో ఆకృతి సుధాకర్, ఫిక్కీ సీఎండీ అచ్యుత జగదీశ్చంద్ర పాల్గొన్నారు.