హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : భూ భారతి చట్టం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. మంగళవారం సచివాలయంలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, భూ భారతి చట్టంపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. 19 రాష్ట్రాల్లో అనుసరిస్తున్న చట్టాలను అధ్యయనం చేసిన తర్వాతే దీనిని రూపకల్పన చేసినట్టు వెల్లడించారు. ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందించడమే ంతోపాటు రాష్ర్టానికి ఇంధన భద్రతను కల్పించడమే క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ లక్ష్యమని స్పష్టంచేశారు. కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, రవిగుప్తా, వికాస్‌రాజ్, సవ్యసాచి ఘోష్, ముఖ్య కార్యదర్శులు దానకిశోర్, రిజ్వీ, క్రిస్టినా జోంగ్తు, కార్యదర్శులు లోకేశ్ కుమార్, యోగితారాణా, సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.