Group 2 Exam | హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమం ఆధునిక ప్రపంచంలోనే ఒక జాతి సలిపిన మహోన్నత పోరాటం. ప్రజాస్వామ్యబద్ధంగా సాధించిన అద్భుత విజయం. అరవై ఏండ్లుగా తెలంగాణ వనరులను, జలాలు, నిధులను దోపిడీ చేసిన వలస పెట్టుబడిదారీ వ్యవస్థను, వలస పెత్తందారీతనం మెడలు వంచి సాధించిన అద్భుత విజయం. ఎన్నో వేదికలు, మరెన్నో పోరాట రూపాలను, ఇంకెన్నో ఉద్యమ పాఠాలను నేర్పిన సందర్భం. ఇదీ తెలంగాణ ఉద్యమ చరిత్ర. సాధించిన ఘనత. ఎక్కడైనా సరే చరిత్ర నిర్మాతలను తలుస్తారు. పోరాట యోధులను కొలుస్తారు. పోరాట ఘట్టాలను మననం చేసుకుంటారు. ముందుతరాలకు ఆ పోరాట గాథలను పాఠాలుగా చెప్తారు. కానీ, పోరాటాన్ని నిర్వీర్యం చేసే శక్తులను లేశమాత్రమైన స్మరించరు. వారి పేర్లను ఉచ్ఛరించడాన్ని సహించరు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అందుకు భిన్నమైన దుస్థితి. ఉద్యమ ద్రోహులదే చరిత్రగా చలామణి అవుతున్నది. చరిత్రగా చిత్రీకరించే ప్రయత్నం ముమ్మరంగా కొనసాగుతున్నది. అందుకు తాజాగా గ్రూప్-2 పరీక్షలో ఉద్యమ చరిత్ర పేపర్లో అడిగిన ప్రశ్నలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఉద్యమ చరిత్రను తక్కువ చేస్తూ, నాటి ఉద్యమ ద్రోహులకు సంబంధించిన అంశాలను ప్రస్తావించడమే అందుకు బలాన్ని చేకూర్చుతున్నది. ఉద్యమ చరిత్రను చెరిపే కుట్రలకు అద్దం పడుతున్నది. సోమవారం నిర్వహించిన గ్రూప్ -2 తెలంగాణ ఉద్యమ చరిత్ర పేపర్లో ఏకంగా 13కు పైగా ప్రశ్నల్లో ఆంధ్రా ప్రాంతం, చంద్రబాబుకు సంబంధించినవే ఉండటం గమనార్హం.
ద్రోహుల చరిత్రకు పెద్దపీట
అనవాళ్లు చెరిపేస్తా, నిశాన లేకుండా చేస్తానన్న రేవంత్‌రెడ్డి సర్కారు అన్నంతపనీ చేసిం ది. తెలంగాణ అసలు చరిత్రను చెరిపేసేందుకు పూనుకుంది. ద్రోహుల చర్రితను క్రమంగా తెలంగాణలో వ్యాప్తి చేయనున్నది. అదే అస లు చరిత్ర అని ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. చంద్రబాబు, రాయపాటి, కావూరి, లగడపాటి పచ్చి తెలంగాణ వ్యతిరేకులు. నరనరాన తెలంగాణ వ్యతిరేకతను ఒంటబట్టించుకుని రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన వారు. వీరిని తలచుకోవడం, వీరి కంపెనీల గు రించి గుర్తుచేసుకోవడం దౌర్భాగ్యమని తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రా ప్రాంతాలకు చెందిన కంపెనీలు, అది దివాలా తీసిన, బ్యాంకులను మోసం చేసిన కంపెనీలకు సంబంధించిన ప్రశ్నలిచ్చారు. తె లుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదు అనడం వెనుక ఇదే కుట్ర దాగి ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఏపీ చరిత్రను తొలగించి పూర్తిగా తెలంగాణీకరించారు. ఇది టీజీపీఎస్సీ కాదు, టీడీపీఎస్సీ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు మీదున్న స్వామిభక్తిని రేవంత్‌రెడ్డి ఇలా చాటుకున్నాడంటూ సోషల్ మీడియాలో పలువురు పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి.
అంతా బాబు భజనే
గ్రూప్ -2 పేపర్ చూస్తే తెలంగాణ ఉద్యమ చరిత్ర ప్రశ్నపత్రమా? లేక, టీడీపీ సన్మాన పత్రమా? అన్న అనుమానం రాకమానదు. గ్రూప్-2 క్వశ్చన్ పేపర్లో రేవంత్‌రెడ్డి పూర్తిగా చంద్రబాబు భజన చేయించాడు! రెండు కళ్ల సిద్ధాంతి చంద్రబాబుకు సంబంధించిన ప్రశ్నలను ప్రశ్నాపత్రం నిండా అచ్చొత్తించాడు! క్వశ్చన్ పేపర్ అంతా బాబు భజనను దగ్గరుండి చేయించినట్టున్నాడు! తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చిన విషయం అత్యంత ప్రధానమైన ప్రశ్న అట! చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్న సంగతి ప్రశ్నాపత్రంలో ఇప్పుడు గుర్తు చేయాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విజన్-2020 డాక్యుమెంట్ తయారు చేసిన సంస్థ ఏదైతే మనకేంటి? ఆ విషయం ఇప్పుడు గ్రూప్-2 అభ్యర్థులను ప్రశ్నించాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజాంసాగర్, కడెం ప్రాజెక్టులను ఎవరు నిర్మించారని ఈ టైంలో అడిగించడం వెనక కుట్ర ఏంటి? తెలుగుదేశం పార్టీ, తెలుగు గౌరవం లాంటి పదాలను బలవంతంగా ప్రశ్నాపత్రంలో చొప్పించడం వెనక ఉన్న ఎజెండా ఏంటి? కావూరి సాంబశివరావు, లగడపాటి, సుబ్బరామిరెడ్డి, రాయపాటి సాంబశివరావు పేర్లు తెలంగాణ గ్రూప్-2 ప్రశ్నపత్రంలో ఎందుకు ప్రత్యక్షమయ్యాయి? ఆంధ్రా రియల్ ఎస్టేట్ కంపెనీల పేర్లను గుర్తించి జతపరచాల్సిన ఖర్మ మనకెందుకు? అసలేం జరుగుతోంది? అన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
ఏపీ వాళ్లకు కట్టబెట్టే కుట్రనా?
గ్రూప్ -2లో రెండో రోజు తెలంగాణ రాష్ట్రానికి అస్సలు సంబంధం లేని ప్రశ్నలు అడిగారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలించిన నేతల పేర్లతో పదుల సంఖ్యలో ప్రశ్నలు అడిగించారు. సంబంధం లేని ప్రశ్నలతో తెలంగాణ అభ్యర్థులు కలవరపడ్డారు. దీని వెనుక గ్రూప్ -2 ఉద్యోగాలను ఏపీవాళ్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతున్నదన్న వాదనలొస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ చరిత్ర పేపర్లో ఉద్యమ చరిత్ర ఉండాల్సిన చోట ఆంధ్రా, తెలుగుదేశం, చంద్రబాబులకు సంబంధించిన ప్రశ్నలను చేర్చారని మండిపడుతున్నారు. మార్పు అంటే ఇదేనా? అనవాళ్లు చెరిపేయడం అంటే ఇదేనా? అని ప్రశ్నిస్తున్నారు. ఇందుకేనా మనం తెలంగాణ తెచ్చుకున్నదని నిలదీస్తున్నారు. ఆంధ్రా బాబు రుణం తీర్చుకునే క్రమంలో రేవంత్‌రెడ్డి డైరెక్షన్లో మరోసారి తెలంగాణ చరిత్రను చేరిపేసే కుట్ర జరుగుతున్నదని అభ్యర్థులు మండిపడుతున్నారు.
తెలంగాణ తల్లి విగ్రహంపై
గ్రూప్ -2 ప్రశ్నల్లో పాత తెలంగాణ తల్లి విగ్రహంపైనా ప్రశ్నలిచ్చారు. కిరీటం, వడ్డాణంలో కోహినూరు, జాకబ్ వజ్రాల ప్రతిరూపాలను కూర్చారు. మెట్టెలు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీతో తయారు చేశారు. గద్వాల్, పోచంపల్లి చీరలను పోలిన చీరలో విగ్రహముంది. చేతిలో బోనము పట్టుకుంది అంటూ ఆప్షన్లు ఇచ్చి వీటిలో ఏది సరికాదో ఎంపిక చేయాలని ప్రశ్నను సంధించారు.
ఎకానమీలో ఆ ప్రశ్నలేవీ?
ఉదయం నిర్వహించిన ఎకానమీ పేపర్లోను 2014 నుంచి 2024 వరకు గల ప్రశ్నలివ్వలేదు. ఇటీవల ఆర్బీఐ నివేదిక కేసీఆర్ సర్కారు పాలన పనితీరును ప్రశంసించింది. అనేక నివేదికల్లో ప్రగతిని కొనియాడింది. కానీ ఎకానమీ ప్రశ్నల్లో 2011- 2013 కాలం నాటి గణాంకాలు, వివరాలపై ప్రశ్నలిచ్చారు. కేసీఆర్ పాలనను కొనియాడటం ఇష్టంలేకే పదేండ్ల ప్రభుత్వ ప్రగతిని ప్రశ్నల్లో ప్రస్తావించలేదని అభ్యర్థులు మండిపడుతున్నారు.
భజన ప్రశ్నలివే (పేపర్ కోడ్ ఎస్) కొన్నింటికి అవునా/కాదా టిక్ చేయాల్సినవి.
పురిటినొప్పులతో పరీక్షకు..
ఉద్యోగం సాధించాలన్న తపనతో ఓ నిండు గర్భిణి గ్రూప్-2 పరీక్షలు రాసింది. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి బల్మూరు మండం బాణాలకు చెందిన రేవతి గ్రూప్-2 పరీక్ష రాసేందుకు వచ్చింది. ఆమె నిండు గర్భిణి కావడంతో వైద్యాధికారులు డెలివరీ డేట్‌ను సోమవారమే ఇచ్చారు. ఉదయం పరీక్షకు హాజరవగా.. పురిటి నొప్పులు రావడంతో అధికారులు కలెక్టర్ సంతోష్ దృష్టికి తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది, అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచారు. మ ధ్యాహ్నం పరీక్ష ముగిశాక దవాఖానకు తరలించారు.
‘గ్రూప్-2’కు 45 శాతమే హాజరు
గ్రూప్ -2 పరీక్ష రెండో రోజు(మంగళవారం) మూడో పేపర్‌కు 45.62 శాతం, నాలుగో పేపర్‌కు 45.57శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.
మలిదశ ఉద్యమ చరిత్రను చెరిపేసే కుట్ర ;మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం
మలిదశ తెలంగాణ ఉద్యమ చరిత్రను చెరిపేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. గ్రూప్-2 పరీక్షలో అడిగిన ప్రశ్నల క్లిప్పింగులను జతచేసి ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు. 2009లో ప్రత్యేక తెలంగాణ కోసం ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి టీడీపీ మద్దతు ఇచ్చిందా? రా యపాటి సాంబశివరావు, లగడపాటి రా జగోపాల్, టీ సుబ్బిరామిరెడ్డి, కావూరి సాంబశివరావు కంపెనీలను గుర్తించండి? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుని నీటి పారుదల ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది నిజ మా? కాదా? వంటి ప్రశ్నలను చూస్తే టీజీపీఎస్సీనా? ఏపీపీఎస్సీ పరీక్షనా అనే అ నుమానం కలుగుతున్నదని ఎద్దేవా చేశా రు. మీరు చెప్పిన మార్పు ఇదేనా? తెలంగాణ ఉద్యమ చరిత్ర స్థానంలో సమైక్య పాలకుల చరిత్రను మార్చడమేనా? అంటూ ప్రశ్నించారు.
తెలంగాణలో ఉన్నది టీడీపీ ప్రభుత్వమా? ; మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
తెలంగాణ గ్రూప్-2 పరీక్షలో టీడీపీ గు రించి ప్రశ్నలు అడగటమేంటని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించా రు. అధికారంలో ఉన్నది తెలంగాణ ప్రభుత్వమా? తెలుగుదేశం ప్రభుత్వ మా? అని నిలదీశారు. తెలంగాణ చరి త్ర ఆనవాళ్లు లేకుండా రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ చరిత్రకే అవమానం : ఎర్రోళ్ల
గ్రూప్-2 పరీక్షలో తెలంగాణకు సం బంధం లేని ప్రశ్నలు, సమైక్య నాయకులపై ప్రశ్నలు అడగడం తెలంగాణ చరిత్ర కు అవమానమేనని ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. నిన్న తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, నేడు చరిత్ర మార్పును చూస్తుంటే కేసీఆర్ చెప్పినట్టు కత్తి ఆంధ్రావాడిదైతే పొడిచేది తెలంగాణ వాడనే మాట నిజమైందని విమర్శించారు.
టీజీపీఎస్సీ చైర్మన్‌పై కేసు పెడతారా?: వై సతీశ్‌రెడ్డి
గ్రూప్-2 పరీక్షలో ఉద్యమ తెలంగా ణ తల్లి కిరీటం, వడ్డాణంపై ప్రశ్నలు అడిగిన టీజీపీఎస్సీ చైర్మన్ మీద కేసులు పెడతారా? అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రశ్న కు సంబంధించిన క్లిప్‌ను ఎక్స్‌లో షేర్ చేసి సీఎంపై సెటైరికల్ ట్వీట్ చేశారు.