e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home తెలంగాణ 48 గంటల్లోనే స్త్రీనిధి రుణాలు అద్భుతం

48 గంటల్లోనే స్త్రీనిధి రుణాలు అద్భుతం

  • ఆశ్చర్యం వ్యక్తంచేసిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ
  • రాష్ట్రంలో ఎస్‌హెచ్‌జీల పనితీరు బాగున్నదని ప్రశంస
  • వీధి వ్యాపారుల భారీ రిజిస్ట్రేషన్లపై ప్రత్యేకంగా ఆరా

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు స్త్రీనిధి సంస్థ ద్వారా 48 గంటల్లోనే రుణాలు మం జూరు చేస్తుండటం పట్ల మహిళా సాధికారికతకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ హీనా గవిత్‌ సంభ్రమాశ్చర్యాలు వ్యక్తంచేశారు. స్త్రీనిధి తరహా సం స్థ దేశంలోనే మొదటిదని, సంస్థ లక్ష్యం, ఉద్దేశాలు బాగున్నాయని ప్రశంసించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా కమిటీ సభ్యులు మంగళవారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మె ప్మా), స్త్రీనిధి పరపతి సమాఖ్య అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌జీల పనితీరు, ఆర్థిక స్వావలంబన సాధించడానికి చేపడుతున్న కార్యక్రమాలను సెర్ప్‌ ఇంచార్జి సీఈవో, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, మెప్మా మిషన్‌ డైరెక్టర్‌, సీడీఎంఏ సత్యనారాయణ, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్‌రెడ్డి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించా రు. మహిళాసంఘాల సభ్యులు, వీధి వ్యాపారులతో కమిటీసభ్యులు ముఖాముఖి మాటాడారు. వారి అనుభవాలను తెలుసుకొన్నారు. తెలంగాణలో ఎస్‌హెచ్‌జీల పని తీరు బాగున్నదని కమిటీ ప్రశంసించింది. రాష్ట్రంలో మహి ళా సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలను అందిస్తున్నారని, ఎన్పీఏలు కూడా చాలా తక్కువ శాతం ఉన్నాయని అభినందించింది. మరుగుదొడ్ల నిర్వహణను ఎస్‌హెచ్‌జీలకు అప్పగించడం, నిర్వహణ సమాచారాన్ని, ఫొటోలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు పొందుపర్చడం పట్ల ప్రశంసలు కురిపించింది. ఇప్పటివరకు వీధి వ్యాపారులకు రూ.357 కోట్ల రుణాలను అందించామని మెప్మా డైరెక్టర్‌ సత్యనారాయణ చెప్పడంతో వీధి వ్యాపారుల రిజిస్ట్రేషన్‌ పెద్దఎత్తున ఎలా సాధ్యమైంది? రుణాలు ఏవిధంగా అందించగలిగారని పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్‌ ఆరా తీశారు.

గ్రీన్‌ఇండియా చాలెంజ్‌తో పచ్చదనం పెంపు

ఎంపీ సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ వంటి కార్యక్రమాలతో దేశంలో పచ్చదద నం పెరుగుతున్నదని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ప్రశంసించింది. కమిటీ సభ్యులు మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజ్వల రెస్క్యూ హోంలో మొక్కలునాటారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ప్రతినిధి రాఘవ కమిటీ సభ్యులకు వృక్షవేదం పుస్తకాన్ని అందజేశారు.

మహిళలు ప్రకృతికే అమ్మలు: సంతోష్‌కుమార్‌

- Advertisement -

కుటుంబాలను నడిపించడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న మహిళలు ప్రకృతి రక్షణ కోసం తల్లి పాత్రను పోషించగలరని ఎంపీ సంతోష్‌కుమార్‌ పే ర్కొన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యులు మొక్కలు నాటడంపై మంగళవారం ఆయన ట్విట్టర్‌ ద్వారా సంతోషం వ్యక్తంచేశారు. కమిటీ చైర్‌పర్సన్‌ తోపాటు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana