హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు గ్రీన్కో సంస్థ-బోల్డ్ అండ్ యూనిక్ ఐడియాస్ లీడ్ డెవలప్మెంట్ (బిల్డ్) సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో 75 మంది విద్యార్థుల ఆవిష్కరణలను ఎంపిక చేసినట్టు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి 600లకు పైగా 120 విద్యాసంస్థల నుంచి వచ్చాయని చెప్పారు. ఎంపికైన ఆవిష్కరణలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు తెలిపారు.