కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న వృక్షార్చనలో భాగంగా ఆదివారం హైదరాబాద్ వెంగళరావు పారులో మొక్కలు నాటిన 40 మంది కార్పొరేషన్ మాజీ చైర్మన్లు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎంపీ, గ్రీన్ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు సంతోష్‌కుమార్ ప్రారంభించారు.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆదివారం వనపర్తి జిల్లా కడుకుంట్ల గ్రామ శివారులోని పంటపొలాల్లో కేసీఆర్ ఫ్లెక్సీతో వేడుకలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ నాయకులు, రైతులు
వృక్షార్చనలో భాగంగా మహబూబాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో మొక్క నాటి సెల్ఫీ దిగుతున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోతు కవిత తదితరులు
వృక్షార్చనలో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటుతున్న బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్‌భాస్కర్
కేటీఆర్, మహేశ్ తన్నీరు పిలుపు మేరకు అమెరికాలోని నెవార్క్ సిటీలో బీఆర్ఎస్ యూఎస్ఏ, హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం అనంతరం కేక్ కట్ చేస్తున్న నాయకులు
జగిత్యాల జిల్లా రాజేశ్వరరావుపేటలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేస్తున్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లిలో మొక్క నాటుతున్న మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తదితరులు
వృక్షార్చనలో భాగంగా సంగారెడ్డిలో వృక్షజీవి డాక్టర్ మార్కండేయులుతో కలిసి మొక్క నాటుతున్న పద్మశ్రీ వనజీవి రామయ్య దంపతులు తదితరులు
కేసీఆర్ జన్మదిన వేడుకలను న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. బీఆర్ఎస్ న్యూజిలాండ్ యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రామారావు, ప్రధాన కార్యదర్శి అరుణ్‌ప్రకాశ్, న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు కల్యాణ్‌రావు, నాయకుడు కిరణ్ పోకల పాల్గొన్నారు.
లండన్‌లో నిర్వహించిన వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొన్న ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం తదితరులు
ఖతర్‌లో బీఆర్ఎస్ ఖతర్ ఉపాధ్యక్షుడు గడ్డి రాజు, సీనియర్ నాయకుడు ఎల్లయ్య తాళ్లపల్లి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామస్థులు 500 మొక్కలు నాటారు. గ్రీన్ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ పిలుపుతో చేపట్టిన వృక్షార్చనలో భాగంగా గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాల్లో మొక్కలు నాటినట్టు మాజీ సర్పంచ్ మీనాక్షి గాడ్గే తెలిపారు.