జీవో 59 దరఖాస్తులకు ఓకే.. రెవెన్యూమంత్రి పొంగులేటి
జీవో 59 కింద 500 చదరపు గజాలు, అంతకంటే తకువ విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను నెలలోగా పరిషరించాలని కలెక్టర్లకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
- 500 చ.గ. లోపు అర్జీలు నెలలో పరిష్కారం.. 22ఏపై ఇప్పటికే ఏడు ఉత్తర్వులు.. ఎర్రవల్లిలో మరోసారి సర్వే
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): జీవో 59 కింద 500 చదరపు గజాలు, అంతకంటే తకువ విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను నెలలోగా పరిషరించాలని కలెక్టర్లకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. భూముల క్రమబద్ధీకరణపై సచివాలయంలోని తన చాంబర్లో ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్షించారు. గతంలో జారీ చేసిన జీవోలు 14, 22, 29, 41 అనుగుణంగా మెమో నంబర్ 48030ను జారీ చేశామని తెలిపారు.
దరఖాస్తుల పరిశీలనలో ఏవైనా అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్టు తేలితే ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని మార్గదర్శకాలు జారీచేసినట్టు వెల్లడించారు. జీవో 59 పరిధిలోని ఆస్తుల విషయంలో అసలు భూమి రికార్డులు, లబ్ధిదారుల అర్హత, క్రమబద్ధీకరించాల్సిన విస్తీర్ణం తదితర అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. న్యాయస్థానాల పరిధిలో ఉన్న వాటిపై కోర్టు ఆదేశాలకు లోబడే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసిందని చెప్పారు.
22ఏకు పరిషారాలు
22ఏతో ముడిపడి ఉన్న 10 నుంచి 12 సమస్యలను ఫాస్ట్ ట్రాక్ విధానంలో పరిషరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి వివరించారు. 22ఏ జాబితాలో ఉన్నా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్ అనుమతులు కలిగిన ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతులు ఇవ్వడం, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తుల పరిషారం, నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల సమస్యకు పరిషారం, తాజాగా 59 జీవో అమలు దరఖాస్తుల పరిషారానికి స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు.
రీ సర్వేను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించేందుకు 7 జోన్లకు ఒకో జోన్‌కు రెవెన్యూ, సర్వే విభాగాల నుంచి ఇద్దరు చొప్పున మొత్తం 14 మంది అధికారులను నియమించినట్టు చెప్పారు. రాష్ట్రంలో తొలి దశలో 365 నక్షాలేని ఎర్రవల్లిలోని 385 ఎకరాల్లో 45 ఎకరాలు తకువ ఉన్నదని.. సర్వే కోసం మరోసారి నోటీసులు ఇచ్చామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

