హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): బస్తీ దవాఖాన, పల్లె దవాఖానల్లో ‘మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్’ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల నియామక ప్రక్రియకు ప్రభు త్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటి ని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించనున్నట్టు వెల్లడించింది. బస్తీ దవాఖానల్లో ఎంబీబీఎస్, బీఏఎంఎస్ పూర్తి చేసిన వారు అర్హులని స్పష్టం చేసింది. పల్లె దవాఖానల్లో ఎంబీబీఎస్, బీఏఎంఎస్తో పాటు స్టాఫ్‌నర్సు, జీఎన్ఎం చేసి ఆరు నెలల కమ్యూనిటీ హెల్త్ బ్రిడ్జి కోర్సు (సీపీసీహెచ్) పూర్తయినవారు దరఖా స్తు చేసుకోవచ్చని సూచించింది. వైద్యులకు రూ.40 వేలు, స్టాఫ్‌నర్సుకు రూ.29,900 గౌరవ వేతనం చెల్లిస్తామని వైద్యారోగ్యశాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నది.