గోదావరి తీరానికి వెదురు కంచె.. 99 లక్షల మొకలతో రిటైనింగ్ వాల్
పర్యావరణ పరిరక్షణ కోసం తపిస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్, వచ్చే ఐదేండ్ల్లలో 100 కోట్ల మొకలు నాటే బృహత్తర సంకల్పంతో 9వ విడత కార్యాచరణను ప్రారంభించింది. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు 50వ పుట్టినరోజు సందర్భంగా గోదావరి తీరంలో 99 లక్షల మొకలు నాటే హరితయజ్ఞం శుక్రవారం మొదలైంది.
- కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా 9వ ఎడిషన్‌ను ప్రారంభించిన జీఐసీ
- మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ శ్రీకారం
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : పర్యావరణ పరిరక్షణ కోసం తపిస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్, వచ్చే ఐదేండ్ల్లలో 100 కోట్ల మొకలు నాటే బృహత్తర సంకల్పంతో 9వ విడత కార్యాచరణను ప్రారంభించింది. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు 50వ పుట్టినరోజు సందర్భంగా గోదావరి తీరంలో 99 లక్షల మొకలు నాటే హరితయజ్ఞం శుక్రవారం మొదలైంది. మహారాష్ట్ర, నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలోని బాబ్లీ వద్ద గోదావరి తీరంలో వెయ్యి వెదురు మొకలు నాటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రీన్ ఇండియా చాలెంజ్(జీఐసీ) సృష్టికర్త, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్, ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ ఫౌండర్ కరుణాకర్‌రెడ్డి, జీఐసీ కో ఫౌండర్ రాఘవేంద్రయాదవ్, యూత్ ఫర్ గోదావరి బృందం, బాబ్లీ, పొరుగు గ్రామాల సర్పంచ్‌లు వెదురు మొక్కలు నాటారు.
గోదావరికి రిటైనింగ్ వాల్లా..
బాసర నుంచి త్రయంబకేశ్వర్ వరకు గోదావరి నదికి రెండు వైపులా నది కోతకు గురికాకుండా ఉండేందుకు 99 లక్షల వెదురు మొకలు నాటి సంరక్షించనున్నారు. ఇందుకోసం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని విద్యార్థులు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, యువజన సంఘాలకు చెందిన 50 లక్షల మంది వలంటీర్లు పనిచేస్తున్నారు. దకన్ ప్రాంతంలో వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకోగల స్థానిక వెదురు రకాలకు ఈ విడతలో ప్రాధాన్యమిచ్చారు. ఈ హరితహారం మంజీరా, ప్రాణహిత నదుల పరీవాహక ప్రాంతాల్లో కూడా కొనసాగనున్నది. ఈ వెదురు చెట్లు.. ప్రకృతి సిద్ధమైన రిటైనింగ్ వాల్లా రక్షణ ఇవ్వనున్నాయి.

వినూత్నంగా కేటీఆర్ బర్త్‌డే..
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ పుట్టిన రోజును గ్రీన్ ఇండియా చాలెంజ్ వినూత్నంగా నిర్వహిస్తున్నది. కేటీఆర్ జీవితంలో పూర్తయిన ఒకో ఏడాదికి రెండు లక్షల మొకల చొప్పున 99 లక్షల మొకలు నాటుతున్నది. వచ్చే ఏడాది వరకు ఈ ప్లాంటేషన్ డ్రైవ్ కొనసాగనున్నది.
నది బాగుంటే.. మనమంతా బాగుంటాం
ఈ సందర్భంగా జీసీఐ వ్యవస్థాపకుడు సంతోష్‌కుమార్ మాట్లాడుతూ.. ‘నది అంటే కేవలం నీటి ప్రవాహం కాదు. అది మానవ సమూహానికి ప్రాణవాయువుతో సమానం. ధరిత్రిపై సకల పంటలు పండేందుకు ఆయువు. కేటీఆర్ 50వ పుట్టినరోజు సందర్భంగా, జీవితకాలాన్ని మించి నిలిచే ఒక విశిష్ట హరిత బహుమతిని ఇవ్వాలనుకున్నాం. అందులో భాగమే ఈ గోదావరి తీరం వెంట 99 లక్షల మొకలతో హరితహారం చేపట్టాం. నది బాగుంటే.. మనమంతా బాగుంటాం. అందుకే నది రక్షణకు మా వంతు కృషి చేస్తున్నాం’ అని తెలిపారు.
‘ఎక్స్’ వేదికగా సంతోష్‌కుమార్ ప్రత్యేక పోస్టు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్ సంతోష్‌కుమార్ ‘ఎక్స్’ వేదికగా చిన్నప్పుడు కేటీఆర్‌తో దిగిన అరుదైన ఫొటోను షేర్ చేసి బర్త్‌డే విషెస్ తెలిపారు. ‘ప్రియమైన సోదరుడు కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజలకు సేవల చేయాలనే అంకితభావం, విజనరీ లీడర్షిప్, మీరు చూపే ప్రేమ లక్షల మందికి స్ఫూర్తిగా నిలుస్తాయి. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

