
నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 8: కులాల ఆధారంగా బీసీల జనగణన చేపట్టాలంటూ సీఎం కేసీఆర్ శుక్రవారం మరోసారి శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానించి కేంద్రానికి పంపడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. బీసీ ఉద్యమచరిత్రలో ఇది మరువలేని రోజని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. ఈ తీర్మానంతో సీఎం కేసీఆర్ బీసీల పక్షపాతిగా అని మరోసారి నిరూపించుకొన్నారని కొనియాడా రు. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బీసీల మనోగ తం తెలిసిన నేతగా సీఎం కేసీఆర్ ఈ తీర్మానాన్ని చేయించడం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని టీఆర్ఎస్నేత, మాజీ ఎంపీ ఎల్ రమణ చెప్పారు. కులగణనకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని బడుగుల పక్షపాతిగా నిలిచారని జాతీయ ఓబీసీ హక్కుల పరిరక్షణ ఫోరం అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ పేర్కొన్నారు. ఈ తీర్మానం దేశానికే ఆదర్శంగా నిలస్తుందని రాష్ర్ట బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు తెలిపారు. కులాల ఆధారంగా బీసీల జనగణ న చేయాల్సిందేనని స్పష్టంచేసిన సీఎంకు బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, కవి, రచయిత జూలూరు గౌరీశంకర్ సెల్యూట్ చేశారు. బీసీ ల అభ్యున్నతి పట్ల కేసీఆర్‌కు ఉన్న నిబద్ధతకు ఈ తీర్మానమే నిదర్శనమని ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ కొనియాడా రు. బీసీల కులగణనకు మరోసారి తీర్మానం చేయడం చరిత్రాత్మకమని తెలంగాణ ఓబీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటాపురం దానకర్ణచారి కొనియాడారు.