నమస్తే తెలంగాణ నెట్వర్క్: ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగానే రాష్ర్టాభివృద్ధి జరుగుతున్నదని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రతిజ్ఞచేశారు. జయశంకర్ రాష్ట్ర ప్రజల గుం డెల్లో చెరుగని ముద్ర వేసుకున్నారని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో సార్ పాత్రను స్మరించుకున్నారు. జయశంకర్ జయంతి వేడుకలను శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఊరూరా సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి స్మరించుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిలా పార్కులో ఆయన విగ్రహానికి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, జయశంకర్ దత్తపుత్రుడు బ్రహ్మం, కుటుంబసభ్యులు, మాజీ ఎంపీ సీతారాంనాయక్, మాజీ మేయర్ గుండా ప్రకాశ్‌రావు, గిరిజన కార్పొరేషన్ మాజీ చైర్మన్ మోహన్‌గాంధీనాయక్ నివాళి అర్పించా రు. మహబూబ్‌నగర్‌లోని పద్మావతి కాలనీలో జయశంకర్ విగ్రహానికి ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పూలమాలలువేసి నివాళి అర్పించారు. కరీంనగర్లో జయశంకర్ విగ్రహానికి బీసీ సంక్షే మశాఖ మంత్రి గంగుల కమలాకర్, నగర మేయ ర్ సునీల్‌రావు, కలెక్టర్ కర్ణన్ పూలమాల వేసి స్మరించుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో నిర్వహించిన సార్ జయంతి వేడుకలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేశ్, ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు నివాళి అ ర్పించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్, టీబీజీకేఎస్ నాయకులు వెంకట్రావ్, మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు.
తెలంగాణ స్వాప్నికుడు జయశంకర్
తెలంగాణ రాష్ట్రం కోసం కలలు కన్న స్వాప్నికుడు జయశంకర్ సార్ అని టీఆర్ఎస్ లోక్‌సభాపక్షనేత నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో జయశంకర్ జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో నామా మాట్లాడుతూ.. ప్రజల్లో తెలంగాణ ఉద్యమ కాంక్ష సడలకుండా నిత్యం శ్రమించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎంపీలు బండా ప్రకాశ్, లింగయ్యయాదవ్, మాలోత్ కవిత, పసునూరి దయాకర్, బీబీ పాటిల్, వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, అంబేద్కర్ వర్సిటీ వీసీ సీతారామారావు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. రాష్ట్ర సాధన కోసం తుదిశ్వాస వరకు అలుపెరుగకుండా శ్రమించిన మహనీయుడు జయశంకర్ సార్ అని శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు గుర్తుచేసుకున్నారు. అరణ్యభవన్‌లో పీసీసీఎఫ్ ఆర్ శోభ, పోలీస్ అకాడమీలో అకాడమీ జాయింట్ డైరెక్టర్ రమేశ్‌నాయుడు, డిప్యూటీ డైరెక్టర్లు నవీన్‌కుమా ర్, శ్రీరాఘవరావు, ఆర్ గిరిధర్, బాలదేవీ, రాఘవేందర్‌రెడ్డి, అసిస్టెంటు డైరెక్టర్లు పీసీవీ రమణ, రవీందర్‌రెడ్డి, శ్రీనివాసచార్యులు, బస్‌భవన్‌లో ఆర్టీసీ ఈడీ పురుషోత్తం, జాయింట్ డైరెక్టర్ గంగారెడ్డి, డీజీపీ కార్యాలయంలో అడిషనల్ డీజీలు శివధర్‌రెడ్డి, ఉమేశ్ష్రాప్, రాజీవ్త్రన్, అడ్మిన్ ఐజీ రాజేంద్రప్రసాద్, ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పా పిరెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లిం బాద్రి, కార్యదర్శి డాక్టర్ ఎన్ శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొని జయశంకర్ సార్ సేవలను కొనియాడారు.