హైదరాబాద్, సెప్టెంబర్ 2: దేశంలో అతిపెద్ద స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది గ్రామిన్ ఇండియా. కంపెనీ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో 540 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌లో కంపెనీకి సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులు లభించనున్నాయని కంపెనీ ప్రాంతీయ డైరెక్టర్ స్కై చెన్ తెలిపారు.
ఇటీవల దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన ఎపిక్స్ ప్రో సిరీస్ స్మార్ట్‌వాచ్‌లకు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభించిందని, ఈ వాచ్ మూడు రకాల్లో లభించనున్నదన్నారు.