నీలగిరి, మే 27: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డబ్బుల పంపకానికి తెరలేపిందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో సో మవారం పోలింగ్ విధానాన్ని ఆయన పరిశీలించారు. నల్లగొండలోని ఎన్జీ కళాశాల వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉప ఎన్నికలు ప్రశాంతంగా సాగాయని, కాంగ్రెస్‌కు బు ద్ధి చెప్పేందుకు ఓటర్లు బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచారని, దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ దాడులు, దౌర్జన్యాలకు దిగిందని ఆరోపించారు. నార్కట్‌పల్లిలో స్వతంత్య్ర అభ్యర్ధి అశోక్‌పై దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. అతి తక్కువ కాలంలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్సేనని అన్నారు. ప్రారంభం నుంచి కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని అన్నా రు. అక్కడక్కడా సీఐలు, ఎస్సై లు కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని, బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో బీజేపీ పోటీలోనే లేదని ఎద్దేవా చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.