ఓటు నమోదులో గ్రాడ్యులేట్!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు, ఆమోదం మందకొడిగా సాగుతున్నది. ఓటరు నమోదుకు పట్టభద్రులు ఉత్సాహం చూపకపోగా, వచ్చిన దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియలోనూ తీవ్ర జాప్యం జరుగుతున్నది. వచ్చే నెల 6 వరకే అంటే ఇంకా ఎనిమిది రోజులే గడువు ఉండగా స్వల్ప వ్యవధిలో లక్షల అప్లికేషన్లను ఎలా పరిషరిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. బుధవారం నాటికి రెండు నియోజకవర్గాల్లో (వరంగల్-ఖమ్మం-నల్లగొండ, మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్,) కలిపి 6,71,642 దరఖాస్తులే అందాయి.
- మందకొడిగా ఓటర్ల నమోదు
- అంతంత మాత్రంగానే దరఖాస్తులు
- గడువు 8 రోజులే.. వచ్చినవి 69శాతమే
- 58వేల దరఖాస్తులకే ఆమోదం
- ఇంకా 6.10 లక్షలకుపైగా పెండింగ్
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు, ఆమోదం మందకొడిగా సాగుతున్నది. ఓటరు నమోదుకు పట్టభద్రులు ఉత్సాహం చూపకపోగా, వచ్చిన దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియలోనూ తీవ్ర జాప్యం జరుగుతున్నది. వచ్చే నెల 6 వరకే అంటే ఇంకా ఎనిమిది రోజులే గడువు ఉండగా స్వల్ప వ్యవధిలో లక్షల అప్లికేషన్లను ఎలా పరిషరిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. బుధవారం నాటికి రెండు నియోజకవర్గాల్లో (వరంగల్-ఖమ్మం-నల్లగొండ, మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్,) కలిపి 6,71,642 దరఖాస్తులే అందాయి.
వీటిలో ఆమోదించినవి 58,537 మాత్రమే. తిరసరించినవి 3,053. ఇంకా 6,10,052 పెండింగ్‌లోనే ఉన్నాయి. అంటే వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 91 శాతం ఇంకా తుది నిర్ణయానికి నోచుకోలేదు. ముఖ్యంగా ఫారం-18 దరఖాస్తుల పరిషారం ఆందోళనకరంగా మారింది. మరి దరఖాస్తుల స్వీకరణతోనే సరిపెడతారా? అర్హులకు సకాలంలో ఓటు హకు కల్పిస్తారా? లేదా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెండింగ్ దరఖాస్తుల్లో అత్యధికం బీఎల్వో స్థాయిలోనే ఉన్నాయి. ఈ స్థాయిలో 4,55,592 దరఖాస్తులు నిలిచిపోయాయి. ఏఈఆర్వో స్థాయిలో 29,262, ఈఆర్వో స్థాయిలో 62,734 పెండింగ్‌లో ఉన్నాయి. మరో 62,464 దరఖాస్తులు ఇంకా ప్రాసెస్ చేయని జాబితాలో ఉన్నాయి. క్షేత్రస్థాయి పరిశీలన నుంచి పైస్థాయి నిర్ణయాల వరకు ప్రక్రియ వేగవంతం కావాల్సిన అవసరం ఉన్నది.
రంగారెడ్డిలో 76 వేలకుపైగా పెండింగ్
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గంలో 3,00,355 దరఖాస్తులు అందాయి. వీటిలో ఆమోదం పొందినవి 14,390 మాత్రమే. మరో 2,85,622 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. రంగారెడ్డిలో అత్యధికంగా 79,606 దరఖాస్తులు రాగా.. 76,745 ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. మేడ్చల్-మలాజిగిరిలో 66, 881 దరఖాస్తులకు 64,537 పెండింగ్‌లో ఉన్నాయి. హైదరాబాద్‌లో 38,916 దరఖాస్తులు రాగా.. 36,913 పరిషారం కోసం ఎదురుచూస్తున్నాయి. నాగర్‌కర్నూల్‌లో 23,950 దరఖాస్తులకు 3,259 ఆమోదం లభించింది. మహబూబ్‌నగర్‌లో 26,326 దరఖాస్తులకు 2,904 ఆమోదించారు. జిల్లాలవారీగా ఆమోదాల సంఖ్యలో వ్యత్యాసాలు కనిపిస్తున్నా. చాలాచోట్ల పెండింగ్ భారమే ప్రధాన సమస్యగా మారింది.
నల్లగొండ, ఖమ్మంలోనూ అదే పరిస్థితి
వరంగల్ -ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గంలో 3,71,287 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 44,147 ఆమోదం పొందగా.. 2,710 తిరసరణకు గురయ్యాయి. ఇంకా 3,24,430 పెండింగ్‌లో ఉన్నాయి. నల్లగొండలో 66,148 దరఖాస్తులకు 59,068 పెండింగ్‌లో ఉన్నాయి. ఖమ్మంలో 59,147 దరఖాస్తులు రాగా.. 45,401 ఇంకా పరిషారం కాలేదు. సూర్యాపేటలో 45,785 దరఖాస్తులకు 41,566 పెండింగ్‌లో ఉన్నా యి. మహబూబాబాద్‌లో 30,545 దరఖాస్తులకు 23,595 పెండింగ్‌లో ఉండటం గమనార్హం. లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, వాటి పరిషారానికి జి ల్లా వారీ లక్ష్యాలు ప్రకటించారా? రోజువారీగా ఎన్ని దరఖాస్తులు పరిషరిస్తున్నారు? ఏ స్థాయిలో ఎంతకాలంగా ఫైళ్లు నిలిచిపోయాయి? అనే అంశాలపై స్పష్టత ఇవ్వడం లేదు.
ఏటా 50 లక్షల నుంచి 3 లక్షల మంది గ్రాడ్యుయేట్లు
ఈ రెండు ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో కలిపి 2021 ఎన్నికల నాటికే పట్టభద్రుల ఓటర్లు మొత్తం 11,39,744 మంది ఉన్నారు. కానీ, ఇప్పటివరకు ఈ రెండు నియోజకవర్గాల నుంచి 6,71,642 (69 శాతం) మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. పాత గణాంకాల లెక్కల ప్రకారం చూసినా ఇంకా సుమారు 4.68 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఓటు నమోదు చేసుకోవాల్సి ఉన్నది. మరోవైపు రాష్ట్రంలో ఏటా సుమారు 2.50 లక్షల నుంచి 3 లక్షల మంది వరకు గ్రాడ్యుయేట్లు యూనివర్సిటీ నుంచి బయటకు వస్తున్నారు. బీటెక్ నుంచి లక్ష, డిగ్రీ నుంచి 1.50 లక్షలు, ఫార్మసీ, ఇతరత్రా కలిపి మరో 30వేల మంది వరకు ఉంటారు. ఇలా మూడేండ్లలో సుమారు 6-7 లక్షల కొత్త గ్రాడ్యుయేట్లు ఓటుకు అర్హులుగా ఉన్నారు. ఇంకా సుమారు 10లక్షల మంది పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాల్సి ఉన్నది. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటర్ల సంఖ్య 12-13 లక్షలకు చేరాల్సి ఉన్నది. ఓటరు నమోదు సరళిని చూస్తే గతంలో ఉన్న ఓటర్ల సంఖ్యకు చేరుతామా? అని అనుమానాలు తలెత్తుతున్నాయి.
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం
బుధవారం వరకు వచ్చిన దరఖాస్తులు : 3,00,355 (52.10 శాతం)
2021 సంవత్సరంలో మొత్తం ఓటర్లు : 5,76,462
వరంగల్ -ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం
బుధవారం వరకు వచ్చిన దరఖాస్తులు : 3,71,287 (65.91 శాతం)
2021 సంవత్సరంలో మొత్తం ఓటర్లు : 5,63,282

Ppp
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

