నేడు, రేపు గేట్ ఎగ్జామ్స్
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) పరీక్షలు ఈ నెల 4, 5తేదీల్లో నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు ఉంటాయి. ఐఐటీలు సహా ఇతర విద్యాసంస్థల్లో ఎంటెక్, మాస్టర్స్ ప్రోగ్రాముల్లో ప్రవేశాల నిమిత్తం గేట్‌ను ఐఐటీ కాన్పూర్
- ఉదయం, మధ్యాహ్నం నిర్వహణ
- ఏటా పెరుగుతున్న అభ్యర్థులు
- రాష్ట్రంలో పరీక్షాకేంద్రాలు 11కు పెంపు
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) పరీక్షలు ఈ నెల 4, 5తేదీల్లో నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు ఉంటాయి. ఐఐటీలు సహా ఇతర విద్యాసంస్థల్లో ఎంటెక్, మాస్టర్స్ ప్రోగ్రాముల్లో ప్రవేశాల నిమిత్తం గేట్‌ను ఐఐటీ కాన్పూర్ నిర్వహిస్తున్నది. మొత్తం దేశవ్యాప్తంగా 8.5 లక్షల మంది విద్యార్థులు గేట్ పరీక్షకు హాజరుకానున్నారు. గేట్లో మంచి ర్యాంకు సాధిస్తే ఎంఎస్, ఎంటెక్ కోర్సుల్లో చేరవచ్చు. అదేవిధంగా, మూడేండ్లపాటు 32 కేంద్రప్రభుత్వ సర్వీసు ఉద్యోగాల ఇంటర్వ్యూలకు ఈ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొంటారు. ఇటీవలికాలంలో సాఫ్ట్వేర్ బూమ్ క్రమంగా తగ్గుతుండటంతో ఇంజినీరింగ్ విద్యార్థులు ఉన్నత చదువులపై దృష్టిసారిస్తున్నారు. పరిశోధనా రంగంలో రాణించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో గేట్ రాసే వారి సంఖ్య పెరుగుతున్నది.
పరీక్షా కేంద్రాలు 11కు పెంపు
రాష్ట్రంలో గేట్ రాసే వారిసంఖ్య ఏటా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలను 11కు పెంచారు. ఇదివరకు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, సూర్యాపేట, ఖమ్మం, కోదాడలోనే పరీక్ష కేంద్రాలుండగా, తాజాగా ఆదిలాబాద్, కొత్తగూడెం, మెదక్, నల్లగొండ జిల్లాల్లో పరీక్ష నిర్వహణకు అనుమతించారు. ఈ పరీక్షల మాక్‌టెస్ట్ పేపర్లను ఐఐటీ కాన్పూర్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. గేట్ రెండో విడత పరీక్షలను ఈ నెల 11,12 తేదీల్లో నిర్వహిస్తారు.
షెడ్యూల్ ఇలా..
- ఈ నెల 4న ఉదయం 9:30 గంటల నుంచి మధ్యా హ్నం 12:30 గంటల వరకు కంప్యూటర్ సైన్స్, తిరిగి మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయం త్రం 5:30 గంటల వరకు ఆర్కిటెక్చర్, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సుల వారికి పరీక్షలుంటాయి.
- ఈ నెల 5న ఉదయం 9:30 గంటల నుంచి మధ్యా హ్నం 12 : 30 గంటల వరకు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ , తిరిగి మధ్యాహ్నం 2 : 30 గంటల నుంచి సాయంత్రం 5 : 30 గంటల వరకు బయోమెడికల్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ కోర్సుల వారికి పరీక్షలు నిర్వహిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

