హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని గ్రేడ్-2 హెచ్ఎంలకు పదోన్నతులు కల్పించాలని తెలంగాణ స్టేట్ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్(టీఎస్‌జీహెచ్‌ఎంఏ)కోరింది. హైకోర్టు తీర్పును అనుసరించి పదోన్నతులు కల్పించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజగంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి గిరిధర్‌గౌడ్ మంగళవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఇంటర్ కాలేజీల్లో క్రీడలు, యోగా, మెడిటేషన్
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ కాలేజీల్లో క్రీడలు, యోగా, మెడిటేషన్ తప్పనిసరి అని ఇంటర్ విద్యా డైరెక్టర్ కృష్ణఆదిత్య వెల్లడించారు. మంగళవారం ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. ఒత్తిడికి లేని విద్యనందించడంలో భాగంగా క్రీడలు, యోగా, మెడిటేషన్న్ను టైమ్ టేబుల్లో చేర్చాలని ఆదేశించారు.