హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) బకాయిల్లో భాగంగా రూ. 2000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగుల బకాయిలు భారీగా పేరుకుపోవడంతో 100 రోజుల్లో రూ. 6,000 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార ఉద్యోగ జేఏసీ నాయకులకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి విడుతగా భట్టివిక్రమార ఆదేశాల మేరకు నిధులు విడుదల చేసినట్టు సుల్తానియా తెలిపారు.