శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Jan 08, 2021 , 13:16:15

ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మండలి చైర్మన్‌ గుత్తా

ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మండలి చైర్మన్‌ గుత్తా

నల్లగొండ : రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం చింతపల్లి మండలం మోదుగుల మల్లెపల్లి గ్రామంలో శ్రీకూర్మాచల సీతారామచంద్రస్వామి ఆలయ నిర్మాణ భూమిపూజ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ నాయక్‌తో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ ఆలయాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే మల్లెపల్లి సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. మోదుగుల మల్లెపల్లి గ్రామ అభివృద్ధికి నిధులను మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీనిచ్చారు.