హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో ప్రాణాలను పణంగా పెడుతున్న అటవీ సిబ్బంది భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని పర్యాటక, సాంసృతిక, ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని అటవీ సంరక్షణను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నెహ్రూ జులాజికల్ పార్లోని స్మారక చిహ్నం వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావు, అధికారులు, సిబ్బంది పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. వన్యప్రాణుల వేట కోసం అమర్చిన విద్యుత్తు వైర్లు తగిలి మరణించిన చెరువుసింగారం వెస్ట్బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్ కుటుంబానికి రూ.30 లక్షల చెకును అందించారు.
హైదరాబాద్, సెప్టెంబర్11 (నమస్తే తెలంగాణ): ఎస్టీఎఫ్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసి దాడులను ముమ్మరం చేయాలని రెవెన్యూ, ఎక్సైజ్ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు అదేశించారు. హైదరాబాద్ ఆబారీ భవన్ సమావేశ మందిరంలో శుక్రవారం క్యూర్ పరిధిలోని ఎక్సైజ్ అధికారులు, ఎస్టీఎఫ్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో రఘునందర్రావు సమీక్ష నిర్వహించారు.