హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ కోర్సుల్లో సీట్ల కన్వర్షన్కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు విద్యాశాఖ జీవో 170ని జారీచేసింది. ఈ నేపథ్యంలో సీట్ల మార్పిడికి 100కు పైగా కాలేజీలు దరఖాస్తులు సమర్పించాయి. దీంతో ఇంజినీరింగ్లో కంప్యూటర్ సైన్స్.. ఐటీ రిలేటెడ్ కోర్సుల్లో మరో 9,120 సీట్లు పెరిగాయి. వీటిని ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్లో భాగంగా భర్తీచేస్తారు. సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ విభాగాల్లో భారీగా సీట్లు రద్దు అయ్యాయి. ఇంజినీరింగ్ బ్రాంచిల్లో కనీస సీట్ల సంఖ్య 30కి పడిపోయింది. గతేడాది 60 సీట్లు ఉండగా, ఈ ఏడాది 30కి కుదించారు. కాలేజీల్లోని కోర్సులను పూర్తిగా రద్దుచేయరాదని, 50 శాతం కనీస సీట్లతో బ్రాంచిలను నిర్వహించాలని ఏఐసీటీఈ ఆదేశాలిచ్చింది.
పలు ఉదాహరణలిలా