నిర్మల్: చదువుల తల్లి బాసర సరస్వతి అమ్మవారిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం 4 గంటలకు బాసరకు చేరుకున్న గవర్నర్.. సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన గవర్నర్ తమిళిసైకి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు. అటునుంచి ఆర్జీయూకేటీకి వెళ్లనున్నారు.
