హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మనసంతా బీజేపీ చుట్టూనే తిరుగుతున్నదా? ఆమె వ్యవహార శైలిని, ట్విట్టర్ ఖాతాను పరిశీలిస్తున్నవారు ఇదే అనుమానం వ్యక్తంచేస్తున్నారు. గవర్నర్ హోదాలో ఉన్నప్పటికీ బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. తన పీఆర్వోగా బీజేపీ కార్యకర్తను నియమించుకొన్నారంటూ ఇటీవల ఎన్డీటీవీ చెన్నై బ్యూరో ఇంచార్జి స్టాలిన్ వెల్లడించిన సమాచారం పెద్ద దుమారమే రేపింది. సోషల్ మీడియాలో సైతం గవర్నర్ బీజేపీ అనుకూల ప్రచారం చేస్తున్నారనే విమర్శలున్నాయి. ట్విట్టర్ ఖాతాలో చేస్తున్న లైక్లు సైతం వివాదస్పదమవుతున్నాయి.