కొత్త జీవితానికి జైళ్లు నాంది పలుకాలి
సమాజ అభ్యున్నతికి శిక్షతోపాటు సంసరణ కూడా అవసరమని, జైళ్లు కేవలం శిక్ష విధించే ప్రదేశాలుగా కాకుండా ఆత్మపరిశీలన, వ్యక్తిత్వ వికాసం, కొత్త జీవితానికి నాంది పలికే కేంద్రాలుగా మారాలని రాష్ట్ర గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా పేరొన్నారు.
- జైలు అనుభవం గొప్ప కార్యక్రమం
- గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా
హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ) : సమాజ అభ్యున్నతికి శిక్షతోపాటు సంసరణ కూడా అవసరమని, జైళ్లు కేవలం శిక్ష విధించే ప్రదేశాలుగా కాకుండా ఆత్మపరిశీలన, వ్యక్తిత్వ వికాసం, కొత్త జీవితానికి నాంది పలికే కేంద్రాలుగా మారాలని రాష్ట్ర గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా పేరొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని చంచల్‌గూడలో రాష్ట్ర కారాగార శిక్షణ సంస్థలో ఫీల్ ది జైల్(జైలు అనుభవం) కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జైలు మ్యూజియంను ప్రారంభించి నిజాం పాలనాకాలంలోని జైళ్లు, నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణంలో ఖైదీల పాత్ర, దాశరథి, రామదాసును బంధించిన జైలు నమూనాలు, ఖైదీల్లో మార్పు కోసం తీసుకున్న చర్యలు, జైలు ఉత్పత్తులు, జైలు కార్యకలాపాలు, అచీవ్మెంట్లను గవర్నర్ పరిశీలించారు. అనంతరం జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రా మాట్లాడుతూ ‘ఫీల్ ది జైల్’ను వినూత్న విద్యా కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జైళ్లశాఖ ఐజీ మురళీబాబు, డీఐజీలు శ్రీనివాస్, సంపత్, సూపరింటెండెంట్ శివకుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాగా జైలు అనుభవం పొందాలనుకున్న వారు 12 గంటలకు రూ.1000, 24 గంటలకు రూ.2వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

