హైదరాబాద్ : వేద సంరక్షణకు నడుం బిగించిన శ్రీవేదభారతి సంస్థ బ్రెయిలీ లిపిలో రచించిన, వెలువరించిన భగవద్గీత, హనుమాన్ చాలీసా పుస్తకాల ఆవిష్కరణ గురువారం జరిగింది. యాదాద్రి జిల్లా పిలాయిపల్లిలోని సప్తపర్ణి ఫౌండేషన్ సంస్థ గోశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరై పుస్తకాలను ఆవిష్కరించారు.
శ్రీ వేదభారతి సంస్థ వ్యవస్థాపకులు, వాచస్పతి, సంస్కృత మిత్ర, సంస్కృత సేవా వ్రతి, వేద గణితవేత్త డాక్టర్ ఆర్వీఎస్ఎస్ అవధానులు ఆధ్వర్యంలో జరిగిన ఈ మహత్కార్యాన్ని గవర్నర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా బ్రెయిలీ లిపిలో రచించిన వారిని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో చిన్మయ్ మిషన్ సెంటర్ స్వామి సర్వేషానంద, శంకర గురుకుల వేదాంత పాఠశాల మేనేజింగ్ ట్రస్టీ పద్మశ్రీ డా. సాయిబాబా గౌడ్, వేద పాఠశాల మేనేజింగ్ ట్రస్టీ బ్రహ్మశ్రీ శ్రీరామ ఘనపాఠి, కంచి కామకోటి పీఠం శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.