మహబూబాబాద్ : రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై(Organic farming) దృష్టి సారించాలని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి(Governor Indrasena Reddy) అన్నారు. మహబూబాబాద్ జిల్లా (Mahabubabad) కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో సొల్లేటి జయపాల్ రెడ్డికి చెందిన అభినవ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్గానిక్ వ్యవసాయ క్షేత్నాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ఆర్గానిక్ వ్యవసాయ విధానాన్ని అవలంబించడం వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు.
సేంద్రియ పద్ధతుల్లో పండిన ధాన్యాన్ని తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభు త్వం ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహిస్తున్నదని, ఆర్గానిక్ వ్యవసాయ విధానంపై రైతుల దృష్టి పెట్టాలని కోరారు. ఈ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహిస్తున్న సొల్లేటి జయపాల్ రెడ్డిని అభినందించారు. అనంతరం తన పర్యటన ముగించుకుని నల్గొండ జిల్లాకు బయలుదేరి వెళ్లారు.