హైదరాబాద్: ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతించారు. దీంతో కారు రేసు కేసులో కేటీఆర్‌పై చార్జ్‌షీట్ వేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి లభించినట్టయింది. కేటీఆర్‌పై విచారణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం ఇటీవల గవర్నర్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే.
ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం తనపై చేస్తున్నది ఉద్దేశపూర్వక, నిరాధారమైన నిందారోపణలే తప్ప నిజాలు ఎంత మాత్రం లేవని కేటీఆర్ గతంలోనే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. సర్కార్ మోపిన అబద్ధాలను తాను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు. కాగా, ఈ వ్యవహారంలో ఏసీబీ విచారణకు కేటీఆర్ ఇప్పటికే నాలుగుసార్లు హాజరయ్యారు.