హైదరాబాద్, జూన్ 30(నమస్తే తెలంగాణ): సిగాచి కర్మాగారంలో పేలుడు ఘటనపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్‌కు ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ఆయన తన సంతాపాన్ని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు.