హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): వచ్చే (2023-24) ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ద్రవ్య వినిమయ బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం ఆమోదించారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 12న ఉభయ సభల్లో ద్రవ్య వినిమయ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టగా, చర్చ అనంతరం ఆమోదం పొందింది. ఉభయ సభల ఆమోదం పొందిన బిల్లును గవర్నర్కు పంపగా ఆమోదముద్ర వేశారు.