హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్‌ను రాష్ట్రంలో అమలు చేస్తున్నట్టు వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమశాఖ కమిషనర్ శైలజ తెలిపారు. సోమవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన సదస్సులో ఆమె మాట్లాడారు.