ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవ చేసే కేంద్రాలుగా ఉండాలి. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలి. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్వచనాన్ని తిరగరాసింది. హెచ్‌జీసీఎల్ (హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్) కార్యాలయాన్ని, హాకా భవన్‌లోని టీఎస్టీఎస్ ఆఫీస్‌ను తమ విషప్రచార కేంద్రాలుగా మార్చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేషన్ చైర్మన్ల సారథ్యంలో ప్రత్యేక సోషల్ మీడియా బృందాలు ఏర్పాటు చేసిందని, వారు ప్రభుత్వ వసతులు వాడుకుంటూ నకిలీ సోషల్ మీడియా ఖాతాలు, పేజీలు, యూట్యూబ్ చానళ్లను నిర్వహిస్తున్నారని చర్చ జరుగుతున్నది.
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ కీలక నేతలను రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్న కాంగ్రెస్.. వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి దిగుతున్నది. ఈ మేరకు కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగాలతో నకిలీ, మకిలి వార్తల ను తయారుచేస్తున్నది. అయితే ఇందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని, సర్కారు కార్యాల యాలను వాడుకుంటుండటం వివాదాస్పదం అవుతున్నది. కాంగ్రెస్ అనుకూల వీడియోలే కాకుండా, బీఆర్ఎస్ నాయకులపై అభ్యంతర కర పోస్టులు రూపొందిస్తున్నది. ఈ విచ్చలవిడి ప్రచారానికి ప్రభుత్వ వసతులు వాడుకోవడం అనైతికం మాత్రమే కాదని, చట్టరీత్యా నేరమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ అడ్డాగా మార్చుకున్న ముఖ్య భవనాల్లో ‘హెచ్‌జీసీఎల్’ ఒకటని తెలిసింది. నానక్‌రాంగూడలో ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న ఈ ప్రభుత్వ కార్యాలయంలో ‘మైండ్షేర్’ పేరుతో పొలిటికల్ కన్సల్టెన్సీని ఏర్పాటు చేసినట్టు పేర్కొంటున్నారు. ఇక్కడినుంచి 4 సోషల్ మీడియా పేజీలు నడుస్తున్నాయని, ఇందులో కేటీఆర్ లక్ష్యంగా విషప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. చాకిరేవు, తెలంగాణ గళం, శతాగ్నికొడుకులు, ఆపన్నహస్తం పేర్లతో ఖాతాలు ఈ భవనం నుంచే నడుస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రజల కోసం అభివృద్ధి ప్రణాళికలు రచించాల్సిన చోట ప్రతిపక్ష పార్టీ నేతల వ్యక్తిత్వాన్ని హననం చేసే పోస్టులు సృష్టిస్తూ మాయని మచ్చ తెస్తున్నారు.
టెక్నాలజీ పక్కదారి..
నాంపల్లిలోని హాకా భవన్లో టీఎస్టీఎస్ (తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్) కార్యాలయం ఉన్నది. సాంకేతిక సేవలు అందించాల్సిన ఈ కార్యాలయంలో టెక్నాలజీ పక్కదారి పట్టిందని, నకిలీ సోషల్ మీడియా ఖాతాలకు, ఫేక్ న్యూస్‌కు కేరాఫ్‌గా మారిందని సమాచా రం. టీఎస్టీఎస్ ఉన్నతస్థాయి వ్యక్తి నేతృత్వం లో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి బహిరంగంగానే ఈ విష ప్రచారానికి ఒడిగట్టినట్టు పేర్కొంటున్నారు. ఆ వ్యక్తి గతంలో సోషల్ మీడియా చైర్మన్‌గా వ్యవహరించారు. ఆయన నేతృత్వంలో సోషల్ మీడియా బృందాలు పనిచేస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భవనం నుంచి మూడు నకిలీ పేజీలు నడుస్తున్నట్టు సమాచారం. తెలంగాణ స్ర్కైబ్ పేరుతో నకిలీ వార్తలు, వీడియోలు సృష్టించి ప్రచారం చేస్తున్నారని, పుకారు బ్యాచ్, హస్తవాసి పేరు తో బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకొని మీమ్స్, తప్పుడు పోస్టులు సృష్టిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఉల్లంఘనల జాతర
తెలంగాణలో కాంగ్రెస్ కేవలం 1.8% ఓట్ల తేడాతో అధికారం లోకి వచ్చింది. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయం పక్కనపెట్టి ప్రతిపక్షంపై విషప్రచారం, అబద్ధాల ప్రచారమే లక్ష్యంగా కొత్త సంస్కృతికి తెరలేపింది. ప్రభుత్వ కార్యాలయాల నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వీడియోలు రూపొందించడం, మీమ్స్ తయారుచేయడం, ప్రత్యర్థి పార్టీ నాయకులపై అవమానకర పోస్టులు రూపొందించడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణించాలని నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వ వనరులు పార్టీకి వినియోగమా?
ప్రజల పన్నులతో నడిచే ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవ చేసే వేదికలుగా ఉండా లి. కానీ ఆ కార్యాలయాలు అధికారంలో ఉన్న ఒక రాజకీయ పార్టీకి సోషల్ మీడియా వేదికలుగా మారుతున్నాయంటే అది పూర్తిగా దుర్వినియోగం కిందకే వస్తుంది. గతంలో ఈ విధమైన చర్యల కారణంగా కొంతమంది అధికారులను సస్పెండ్ చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ప్రభుత్వ వనరులను పార్టీ ప్రయోజనాల కోసం ఉపయోగించడం వల్ల, ప్రభుత్వ యం త్రాంగంపై ప్రజల్లో నమ్మకం దెబ్బతినే ప్రమా దం ఉన్నది. ప్రభుత్వ వ్యవస్థను పార్టీ వ్యవస్థ గా మార్చే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలివ్వడమే అవుతుంది. ఈ విధమైన చర్యలకు కళ్లెం వేసి బాధ్యులను శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ కంచే చేనుమేసినట్టుగా ప్రభుత్వమే ప్రభుత్వ కార్యాలయాల నుంచి విపక్షాలపై అసత్య వార్తలు తయారు చేసి సోషల్ మీడియాలో దాడులకు దిగడం క్షమించరాని నేరమని రాజకీయ విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు.
దుర్వినియోగానికి అడ్డుకట్ట పడేనా?
కేవలం అధికారం చేతిలో ఉన్నదన్న అహంకారం, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేరన్న బరితెగింపుతోనే ఏకంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. బీఆర్ఎస్పై, ఆ పార్టీ పెద్దలపై దుష్ప్రచా రం చేసేందుకు ఏకంగా ఓ కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ డిజిటల్ మీడియా మేనేజర్ కలిసి ప్రభుత్వ కార్యాలయాలనే అడ్డాగా చేసుకోవడాన్ని ప్రభుత్వం ఎలా పరిగణిస్తుంది? ఇకనై నా అబద్ధాల ప్రచారానికి అడ్డుకట్ట వేస్తుందా? లేక ప్రోత్సహిస్తుందా ? అనేది వేచి చూడాలి.
ప్రజాస్వామ్యం ఖూనీ..
తమది ఇందిరమ్మ పాలన అని, పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగిస్తామని అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కాంగ్రె స్ నేతలు ప్రచారం చేస్తున్నారు. సీఎం రేవంత్ మొదలు నేతలంతా రోజూ ఇందిరమ్మ పాలన జపం చేస్తున్నారు. కానీ వాస్తవంలో మాత్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మేధావులు మండిపడుతున్నా రు. ఇందుకు 20 నెలల ప్రభుత్వ పాలన లో అన్ని వర్గాలకు జరిగిన అన్యాయమే ఉదాహరణగా పేర్కొంటున్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్ష పార్టీల నేతలపై విషప్రచా రం చేసే స్థాయికి దిగజారిపోయారని మండిపడుతున్నారు.
అభివృద్ధి చేసి ప్రజల మెప్పు పొందాల్సింది పోయి, వ్యక్తిత్వాన్ని కించపరచడం ద్వారా ప్రజల్లో బీఆర్ఎస్ నేతలపై ఉన్న అభిమానాన్ని తగ్గించాలనుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను, వనరులను, సాంకేతిక సదుపాయాలను వాడుకొని కాంగ్రెస్‌కు అనుకూలంగా, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియా కార్యకలాపాలు నిర్వహించడం అధికార పార్టీ దీనస్థితికి అద్దం పడుతున్నదన్నారు. ప్రజల పన్నులతో నడిచే కార్యాలయాలను సొం తానికి ఎలా వాడుకుంటారని నిలదీస్తున్నారు. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమేనని స్పష్టంచేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.