పొంగులేటి పక్కా కమీషన్రెడ్డి
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పక్కా కమీషన్రెడ్డిగా మారారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. పని ఏదైనా ఆయనకు కమీషన్లు ముట్టజెప్పాల్సిందేనని ఆరోపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కరువు పరిస్థితులపై ఇదే జిల్లాకు చెందిన మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ లేకుండానే మంత్రులు పొంగులేటి, పొన్నం కలిసి సమీక్షించడం శోచనీయమని పేర్కొన్నారు.
- దేవాదుల పంప్‌ల ఆన్‌పై సర్కార్ అలసత్వం: పోచంపల్లి
- దావత్ల కోసమే మంత్రులు దేవాదులకు: సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పక్కా కమీషన్రెడ్డిగా మారారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. పని ఏదైనా ఆయనకు కమీషన్లు ముట్టజెప్పాల్సిందేనని ఆరోపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కరువు పరిస్థితులపై ఇదే జిల్లాకు చెందిన మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ లేకుండానే మంత్రులు పొంగులేటి, పొన్నం కలిసి సమీక్షించడం శోచనీయమని పేర్కొన్నారు.
ఈ వ్యవహారం కాంగ్రెస్‌లోని కుమ్ములాటలకు అద్దంపడుతున్నదని వ్యాఖ్యానించారు. గిరిజన, బీసీ మంత్రులపై పొంగులేటి కక్ష కట్టారా? అని ప్రశ్నించారు. బుధవారం ఆయన తెలంగాణభవన్‌లో మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్రావు, బీఆర్ఎస్ నేత లక్ష్మణ్‌రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. కన్నెపల్లి, దేవాదుల పంపులు ఆన్‌చేసి నీరెత్తిపోయాలని అడిగిన బీఆర్ఎస్ నేతలపై నిందారోపణలు చేయడం దుర్మార్గమని ఖండించారు. ఇన్చార్జి మంత్రి పొంగులేటితో ఉమ్మడి వరంగల్‌కు శనిపట్టిందని విమర్శించారు. సమీక్షకు పిలువకుండా అవమానించిన మంత్రులు వెంటనే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎల్ నినోపై స్పష్టత కరువు: పెద్ది
ఎల్ నినో కారణంగా కరువు ముంచుకొస్తుంటే కాంగ్రెస్ సర్కార్‌కు స్పష్టత కరువైందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మండిపడ్డారు. జూన్ 1 నుంచి కన్నెపల్లి వద్ద నీటి ప్రవాహం ఉన్నా ఎత్తిపోయడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని దు య్యబట్టారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏడు రకాల వరి విత్తానలపైనే సమీక్షించారని, కానీ బయటకు మాత్రం సాగునీటిపై చర్చించినట్టు పచ్చి అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఒత్తిడితోనే కాంగ్రెస్ సర్కార్ కండ్లు తెరిచి దేవాదుల పంపులు ఆన్చేసిందని స్పష్టంచేశారు. నీటిపారుదల ప్రాజెక్టులపై అవగాహనలేని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దేవాదులపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

