గ్రామానికో రెవెన్యూ ఉద్యోగి!
రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఉండాలన్నదే లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.
- ధరణి పోర్టల్, ఆర్వోఆర్ చట్టానికి సవరణలు చేస్తాం
- రెవెన్యూ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఉండాలన్నదే లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన.. రైతులు సులభంగా దరఖాస్తు చేసేలా ధరణి పోర్టల్‌లో మార్పులు చేస్తామని చెప్పారు. ధరణి పెండింగ్ దరఖాస్తులు 2.45 లక్షలు ఉండేవని, తర్వాత మరో లక్ష దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. స్లాట్ రద్దు చేసుకున్నవారికి ఆరు నెలల్లోగా డబ్బులు వచ్చేలా మార్పులు చేస్తామని తెలిపారు.
భూముల విలువ సవరణపై కసరత్తు జరుగుతున్నదని, ఎల్ఆర్ఎస్ను క్లియర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. జీవో 59 కింద అక్రమాలు జరిగినట్టు దృష్టికి వచ్చిందని, అందుకే వాటి రిజిస్ట్రేషన్లు నిలిపివేశామని వివరించారు. 100 గజాలలోపు స్థలాలకు రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. ఆదాయం వస్తున్న 36 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు కార్పొరేట్ కంపెనీల సీఎస్ఆర్ నిధులతో భవనాలు నిర్మించి, నిర్వహణ సైతం వాటికే అప్పగిస్తామని తెలిపారు.
రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లకన్నా ఎక్కువే ఖర్చయ్యే అవకాశం ఉన్నదని చెప్పారు. ఇప్పటికే రూ.9 వేల కోట్లు సమీకరించామని, మిగతావి ఇతర మార్గాల్లో సమకూర్చుకుంటామని వెల్లడించారు. రైతుభరోసాపై అభిప్రాయ సేకరణ ఖమ్మం నుంచి మొదలుపెడుతున్నామని అన్నారు. శ్రావణపల్లి గనిలో బొగ్గు నాణ్యత తక్కువగా ఉన్నట్టు నివేదికలు అందుతున్నాయని తెలిపారు. కమర్షియల్, ఆఫీస్ స్పేస్ లీజు పెరిగిందని, ఇండ్ల అమ్మకం పెరగలేదని చెప్పారు.
ఇందిరమ్మ ఇండ్లపై అధ్యయనం కోసం ఇప్పటికే యూపీ, ఏపీకి అధికారులు వెళ్లి వచ్చారని వివరించారు. డబుల్ బెడ్రూం ఇండ్లలో తక్కువఖర్చు అయ్యేవాటిని పూర్తిచేసి నిరుపేదలకు అందిస్తామని, రాజీవ్ స్వగృహ ఇండ్ల ధరలను సమీక్షించేందుకు ఇటీవలే కమిటీ వేశామని చెప్పారు. పెన్షన్ల పెంపునకు సంబంధించి ఈ బడ్జెట్లో నిధులు పెట్టే అవకాశం ఉన్నదని, లబ్ధిదారుల జాబితాను సమీక్షించాల్సిన అవసరం ఉన్నదని వెల్లడించారు. తమ ప్రభుత్వం స్థిరంగా ఉందనే భావన వచ్చే వరకు ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

