పాత అక్రెడిటేషన్ల పొడిగింపునకు నో.. హైకోర్టు ఆదేశించినా పట్టించుకోని ప్రభుత్వం
అర్హులైన వరింగ్ జర్నలిస్టుల పాత అక్రెడిటేషన్ కార్డుల గడువును ఈ నెల 15 వరకు పొడిగించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): అర్హులైన వరింగ్ జర్నలిస్టుల పాత అక్రెడిటేషన్ కార్డుల గడువును ఈ నెల 15 వరకు పొడిగించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నది. హైకోర్టు ఉత్తర్వులు జారీచేసి 10 రోజులు పూర్తవుతున్నా పాత అక్రెడిటేషన్ కార్డులను పొడిగించకపోవడంతో వరింగ్ జర్నలిస్టులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అక్రెడిటేషన్ అర్హతలపై ప్రభుత్వం జారీచేసిన జీవోను సవాల్ చేస్తూ పలు సంస్థలు, పాత్రికేయులు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం గత నెల 25న విచారణ జరిపింది.
ఉభయపక్షాల వాదనల అనంతరం తదుపరి విచారణను కోర్టు ఈ నెల 15 వరకు వాయిదా వేసింది. అప్పటివరకు పాత అక్రెడిటేషన్ కార్డుల చెల్లుబాటును పొడిగించాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో తమకు మరో 20 రోజులపాటు బస్‌పాస్‌లు వస్తాయని కొందరు జర్నలిస్టులు ఆశించారు. కానీ రాష్ట్ర పౌరసంబంధాల శాఖ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. తమకు హైకోర్టు ఉత్తర్వుల ప్రతులు అందలేదని ప్రభుత్వం, సమాచార శాఖ, ఆర్టీసీ అధికారులు అంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

