హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): 13 జిల్లాలకు నర్సింగ్ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది.
జనగామ, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రామగుండం(మంచిర్యాల), మెదక్, కుత్బుల్లాపూర్(మేడ్చల్ మల్కాజిగిరి), ములుగు, నారాయణపేట, మహేశ్వరం(రంగారెడ్డి), నర్సంపేట(వరంగల్), యాదాద్రి భువనగిరిలోని మెడికల్ కాలేజీలకు అనుబంధంగా వీటిని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది.