మేడ్చల్ మల్కాజిగిరి : మహిళల్లో సాంకేతిక నైపుణ్యం పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం ఘట్కేసర మున్సిపాలిటీ సర్వే నంబర్ 119 ప్రభుత్వ స్థలం 5 ఎకరాలలో మహిళా ఐటిఐ భవణ నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో నైపుణ్యం పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. మహిళలకు విద్యతో పాటు, శాస్త్ర సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తే మరింత ముందుకు పోయే ధైర్యం వారిలో పెరుగుతుందని తెలిపారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ మహిళల్లో విద్య, సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించి, అన్ని రంగాల్లో రాణించేలా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఘట్కేసర్ మున్సిపాలిటీ కొండాపూర్లో రూపొందుతున్న మహిళా ఐటిఐ ని ఆదర్శంగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి వివరించారు.
హెచ్ఏఎల్ కంపెనీ సీఎస్ఆర్ ఫండ్ 7కోట్ల రూపాయలతో ఈ మహిళా ఐటిఐ ఏర్పాటు కాబోతుందన్నారు.
ఈ ఐటిఐ ఏర్పాటుకు మున్సిపాలిటీ చైర్పర్సన్ పావనితో పాటుగా.. ప్రతి ఒక్కరు కష్టపడారని పేర్కొన్నారు. దీంతో ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శాంసన్, ఏచ్ఏఎల్ జీఎంలు అరున్జనార్దన సర్కాటే, చంద్రకాంత్, హెచ్ఆర్ చీఫ్ మేనేజర్ జితేందర్పాల్కౌర్, డీజీఎం సీఎస్ సురేందర్జీ, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.