అచ్చంపేట రూరల్/ చండ్రుగొండ, ఫిబ్రవరి 5 : ఎస్సీల వర్గీకరణను నిరసిస్తూ మాలమహానాడు మండల కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను బుధవారం దహనం చేశారు. శాసన మండలిలో వర్గీకరణ బిల్లు ఆపాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో ఏకపక్షంగా తీర్మానం చేయడాన్ని నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఓయూలో రేవంత్ దిష్టిబొమ్మ దహనం
ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 5: ఎస్సీ వర్గీకరణ తీరు సరిగా లేదని తెలంగాణ మాల విద్యార్థి జేఏసీ నేత మాదాసు రాహుల్ పేర్కొన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమాక్క కలిసి తడిగుడ్డతో తమ గొంతు కోశారని మండిపడ్డారు. గతంలో మాలలకు ఉన్న ఆరు శాతం రిజర్వేషన్లను ఐదు శాతానికి కుదించడం సిగ్గుచేటని పేర్కొన్నారు.