సుల్తాన్ బజార్, డిసెంబర్ 13: సీఎం రేవంత్‌రెడ్డిని సచివాలయంలో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం కోర్ కమిటీ సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలోని సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన సీఎం.. త్వరలోనే ఆ శాఖ మంత్రి సమక్షంలో వైద్యుల సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. సీఎంను కలిసినవారిలో కోర్ కమిటీ సభ్యులైన డాక్టర్లు పల్లం ప్రవీణ్, బీ రమేశ్, నరహరి, రంగా అజ్మీరా, లాలూప్రసాద్ రాథోడ్, వినోద్ తదితరులు ఉన్నారు.