హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఔషధ మొక్కల విస్తీర్ణాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఔషధ మొక్కలు పెంచేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆయుష్శాఖకు ఆదేశించింది. అంతేకాకుండా ఇతర రాష్ర్టాల్లోనూ అధ్యయనం చేయాలని సూచించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఓ కమిటీ కేరళ, తమిళనాడు రాష్ర్టాల్లో పరిశోధనకు వెళ్లనున్నది.
ఆయా రాష్ర్టాల్లో ఆయుర్వేద వైద్యంలో వినియోగిస్తున్న మొక్కలపై ఈ బృందం అధ్యయనం చేయనున్నది. అనంతరం ఆ మొక్కల సాగుపై పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేయనున్నది.