హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : గృహజ్యోతి పథకం సబ్సిడీ మొత్తాన్ని సర్కార్ మంజూరుచేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,080కోట్లు డిస్కమ్‌లకు మంజూరుచేస్తూ బుధవారం జీవో జారీచేసింది. ప్రతి నెలా రూ. 186.96కోట్ల చొప్పున ఏప్రిల్ నుంచి వాయిదాల పద్ధతిలో ఈ మొత్తాన్ని చెల్లిస్తామన్నది. జీవోలో ఒకట్రెండు చోట్ల తప్పులు దొర్లాయి.
మంజూరుచేసిన మొత్తానికి అదనంగా ఒకట్రెండు సున్నాలు కలిపారు. ఇదే విషయంపై సోషల్ మీడియాలో చర్చకు దారితీయడంతో చివరికి సర్కార్ పొరపాటును సరిదిద్దుకొని, మళ్లీ జీవో విడుదల చేసింది.