హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): ఉద్యానశాఖలో విస్తరణాధికారులను ప్రభుత్వం నియమించింది. ఔట్సోర్సింగ్ పద్ధతిలో 175మందిని ఉద్యాన విస్తరణాధికారులుగా తిరిగి నియమిస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీచేశారు.
రాష్ట్రంలోని 32 జిల్లాలతోపాటు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సెంటర్ ఫర్ ఎక్స్టెన్షన్, సిద్దిపేట జిల్లా ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్షన్లను విస్తరణ అధికారులను కేటాయించింది. రాష్ట్రంలో ఆయిల్‌పామ్, కూరగాయలు, పండ్ల తోటల విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రాధాన్యం కల్పించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. 175మందిని నియమించినట్టు ఉత్తర్వుల్లో తెలిపింది.
ఉద్యానశాఖలో 175మందిని ఉద్యాన విస్తరణ అధికారులుగా నియమించడం పట్ల తెలంగాణ ఉద్యాన అధికారుల సంఘం హర్షం వ్యక్తంచేసింది. సీఎం రేవంత్‌రెడ్డి, మం త్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ సెక్రటరీ రఘునందన్‌రావు, ఉద్యానశాఖ డైరెక్టర్ యాస్మిన్ భాషలకు ధన్యవాదాలు తెలిపారు.