హైదరాబాద్ : విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులకు ప్రభుత్వం ప్రత్యేక సేవా పతకాలను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్యాలంటరీ అవార్డుల మాదిరిగా అత్యుత్తమ సేవలందించే పోలీస్ అధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం గత కొన్నేళ్లుగా ఈ అవార్డులను అందిస్తూ వస్తోన్నది. ఆదివారం ప్రకటించిన ఈ అవార్డుల్లో ఏడుగురికి మహోన్నత సేవా పతకాలు, 50 మందికి కఠిన సేవా పతకాలు, 90 మందికి ఉత్తమ సేవా పతకాలు, 471 మందికి సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది.
మహోన్నత సేవా పతకానికి ఎండీ షర్ఫుద్దీన్ (ఏఆర్ఎస్ఐ-వరంగల్), ఎల్ లింగారావు (ఏఆర్ఎస్ఐ-వరంగల్) పల్లి రాంచంద్రం (ఎస్ఐ – రాజన్న సిరిసిల్ల), రామపురం వెంకటయ్య (అడిషనల్ కమాండెంట్- 4వ బెటాలియన్, వరంగల్), జీ సామ్యూల్ రాజు (ఏఆర్ఎస్ఐ – 8వ బెటాలియన్, కొండాపూర్), కొల్లూరి రాజేంద్ర ప్రసాద్ (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ – ఇంటిలిజెన్స్, హైదరాబాద్), పీడీ క్రిస్టోఫర్ (హెచ్సీ-1892, భద్రాద్రి కొత్తగూడెం) ఎంపికయ్యారు.