హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): ఇటీవల 17 కార్పొరేషన్లకు పాలకవర్గాలను నియమించిన ప్రభుత్వం మేదరి కార్పొరేషన్‌ను విస్మరించడం దురదృష్టకరమని మేదరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జోరిగల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వివిధ కులాల అభ్యున్నతికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం, నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఇప్పటికైనా పాలకవర్గాలను నియమించడంతోపాటు నిధులు కేటాయించాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
మార్క్‌ఫెడ్ ఎండీ ఆకస్మిక బదిలీ
హైదరాబాద్, మే 9(నమస్తే తెలంగాణ): మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్‌రెడ్డిని ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. ఈ మేరకు శనివారం రాత్రి 10 గంటలకు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కో ఆపరేటివ్ సొసైటీస్ కమిషనర్ రాహుల్‌రాజ్‌కు మార్క్‌ఫెడ్ ఎండీగా అదనపు బాధ్యతలను అప్పగించారు. మక్కల కొనుగోళ్లలో నిర్లక్ష్యం, ఇతర వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడమే శ్రీనివాస్‌రెడ్డి బదిలీకి కారణమని సమాచారం.